సిగరపల్లిలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లిన ఎమ్మెల్యే మురళీమోహన్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

ఐరాల మండలం సిగరపల్లిలో కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు గాజు గ్లాస్, సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.