మహిళల ఉత్పత్తుల విక్రయానికి స్వయం ఏపీ బ్రాండ్

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించేందుకు ప్రభుత్వం స్వయం ఏపీ బ్రాండ్ను అందుబాటులోకి తెచ్చిందని మెప్మా అధికారులు తెలిపారు. మెప్మా సహకారంతో మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని సూచించారు. వస్తువుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ఆన్లైన్ విక్రయాలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదుగాలని జిల్లా మెప్మా పీడీ చిట్టిరాజు కోరారు. తద్వారా మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడి మహిళలకు మెరుగైన ఆదాయం సమకూరుతుందని అధికారులు పేర్కొన్నారు.