వైద్య విద్యార్థులకు భారీ షాక్: విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీలపై ఎన్ఎంసీ అస్పష్టత
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీల చెల్లుబాటుపై జాతీయ వైద్య కమిషన్ ఇస్తున్న విరుద్ధమైన సమాధానాలు విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఢిల్లీ హైకోర్టు న్యాయవాది సచిన్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. జార్జియాలో వైద్య విద్య అభ్యసించడంపై స్పష్టత కోరిన అభ్యర్థులకు ఎన్ఎంసీ వేర్వేరు సమాధానాలు ఇవ్వడంతో ఏజెంట్లు తప్పుదారి పట్టిస్తున్నారని, దీనివల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.