భవన నిర్మాణ అనుమతులలో డిజిటల్ విధానం మరియు కఠిన నిబంధనలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో భవన నిర్మాణాలు, లేఅవుట్లు మరియు అభివృద్ధి పనుల అనుమతుల ప్రక్రియను పూర్తిగా డిజిటల్ వేదికలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తప్పుడు సమాచారంతో అనుమతులు పొందితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేయనున్నట్లు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.