రైతులకు ఆధునిక సాంకేతికత: కిసాన్ నెట్వర్క్, ఏఐ వాయిస్ ఏజెంట్ను ప్రారంభించిన మంత్రి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: బాపట్ల

రైతులకు ఆధునిక సాగు సాంకేతికతను అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంగ్రూ ఇన్నోవేటివ్ కిసాన్ నెట్వర్క్, ఏఐ ఆధారిత వాయిస్ ఏజెంట్ వ్యవస్థలను ఆయన ఆవిష్కరించారు. రూ.ఏడు కోట్లతో నిర్మించిన పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కేంద్రం, వ్యవసాయ యంత్ర పరికరాల పరిశోధన కేంద్ర భవనాలను ప్రారంభించారు. ఇంటర్నెట్ లేకపోయినా తెలుగులో సులభంగా అర్థమయ్యేలా రైతుల సందేహాలను ఏఐ ఏజెంట్ నివృత్తి చేస్తుందని మంత్రి వెల్లడించారు.