నగర వీధుల్లో సరికొత్త రుచుల విందు వేదిక

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు నగరంలోని మెయిన్ బైపాస్ జాతీయ రహదారిపై ఆరా ఫ్యామిలీ వెజిటేరియన్ రెస్టారెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ట్రాఫిక్ సీఐ కృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ రెస్టారెంట్ ను ప్రారంభించారు. నిర్వాహకులు గణేష్, దినేష్ రెడ్డి అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు వివిధ రకాల శాఖాహార వంటకాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.