టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక ప్రకటన: బ్యాటింగ్ ఆర్డర్ పై క్లారిటీ

రిపోర్టర్: హరి స్థలం: ఆక్లాండ్

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్ నాలుగు స్థానాలు ఇప్పటికే ఖరారయ్యాయని, ఐదు, ఆరో స్థానాల్ లో మాత్రం మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఫ్లెక్సిబుల్ విధానాన్ని అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు. టాప్ ఆర్డర్ లో కుడిచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉన్నందున, అవసరమైతే అక్షర్ పటేల్ లేదా కేఎల్ రాహుల్ను ముందుగా పంపిస్తామని గిల్ తెలిపారు.