ఇంద్రాయణి నదిలో వేలాదిగా తేలిన చనిపోయిన చేపలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని పుణే సమీపంలోని ఆళంది ఆలయం వద్ద ఇంద్రాయణి నదిలో వేలాదిగా చనిపోయిన చేపలు తేలడం కలకలం రేపింది. నదిలో పెరుగుతున్న కాలుష్యం, శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు కలవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ములా నదిలో కూడా ఇలాగే జరగడం గమనార్హం.