ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి సోమవారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే చావు డప్పు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమని ఆరోపిస్తూ కాంగ్రెస్ పాలనను తీవ్రంగా తప్పుబట్టారు.