హరీష్‌రావును విమర్శించే స్థాయి ఐలయ్యకు లేదన్న కల్లూరి రామచంద్రారెడ్డి
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై రాజాపేటలో బీఆర్ఎస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూ కబ్జాల బకాసురుడిగా పేరుగాంచిన ఐలయ్యకు, మాజీ మంత్రి హరీష్‌రావును విమర్శించే స్థాయి లేదన్నారు. ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి పెరిగిపోయాయని రామచంద్రారెడ్డి ఆరోపించారు.