బాలల వేధింపుల కేసులను దర్యాప్తు సంస్థలకు ఇవ్వనున్న మెటా

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

బాలలపై లైంగిక వేధింపుల కేసుల వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించేందుకు టెక్ దిగ్గజం మెటా అంగీకరించింది. ఇకపై పిల్లల భద్రతకు సంబంధించిన విషయాలను ఐ4సీ సైబర్ క్రైమ్ పోర్టల్‌కు మెటా నేరుగా నివేదిస్తుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఆన్‌లైన్‌లో పిల్లల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, చర్యలు తీసుకోని ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాయి.