ఖల్ నాయక్ రిటర్న్స్ లో సల్మాన్ ఖాన్: కీలక పాత్రపై జోరుగా చర్చలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Mumbai
ముప్ పై ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఖల్ నాయక్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఖల్ నాయక్ రిటర్న్స్ సినిమాలో ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం ఉందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు సుభాష్ ఘాయ్ సహా మేకర్స్ సల్మాన్ తో చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.