భామినిలో వర్షపు నీటితో నిండిన ఎంపీడీవో కార్యాలయం: అభ్యర్థుల ఇబ్బందులు
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
భామిని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందే వర్షపు నీరు నిలిచిపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అధికారులు తెలిపారు. తుపాను కారణంగా మంగళవారం కురిసిన చిరుజల్లులకు కార్యాలయం ముందు భారీగా నీరు చేరింది. దీంతో ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు వచ్చిన అభ్యర్థులు గోతిలో నిలిచిన నీటిని దాటుకుని వెళ్లాల్సి వచ్చింది. పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఘటనే అద్దం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.