లండన్ థేమ్స్ నదిపై తొలిసారిగా అంగరంగ వైభవంగా గంగా హారతి.

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున తొలిసారిగా సాంప్రదాయ గంగా హారతి కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. చిన్మయ మిషన్ యూకే ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది భారతీయ ప్రవాసులు తరలివచ్చారు. థేమ్స్ నది ఒడ్డున దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పారు.