విజయ డెయిరీ నూతన చైర్మన్గా దాసరి బాలవర్ధనరావు ఏకగ్రీవ ఎన్నిక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కృష్ణా
కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి విజయ డెయిరీ నూతన చైర్మన్గా సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత దాసరి వెంకట బాలవర్ధనరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చలసాని ఆంజనేయులు రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ, పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు విజయ డెయిరీ కార్యాలయంలో సమావేశమైన డైరెక్టర్లు బాలవర్ధనరావు పేరును ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు.