తిమ్మాయపాలెంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేల్

చిట్వేలు మండలం తిమ్మాయపాలెం క్రాస్లోని శ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాతాజీ ఆధ్వర్యంలో భక్తులు కృష్ణ పరమాత్ముడిని భక్తిశ్రద్ధలతో కొలిచారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, భగవద్గీత పారాయణం, స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. హరే రామ భజనలతో ఆశ్రమం మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.