వడివడిగా తారకరామ ప్రాజెక్టు నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 24,710 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రూ.350 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.400 కోట్లతో మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు.