విశాఖలో నిరుపేదల ఆకలి తీరుస్తున్న కమ్యూనిటీ ఫ్రిజ్ సేవలు
రిపోర్టర్: మహేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ ఫ్రిజ్‌ల ద్వారా నిరాశ్రయులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. ఆహారం వృథా కాకుండా పేదలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సేవలు కొనసాగుతున్నాయి. దాతలు ఆహారాన్ని విరాళంగా ఇచ్చేందుకు కంట్రోల్ రూమ్ సీఐ నంబర్ 9490617924 సంప్రదించాలని పోలీసులు కోరారు.