కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళా రైతులు మృతి
రిపోర్టర్: రమేష్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు మహిళా రైతులు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఉదయం సంతోషంగా పనికి వెళ్లిన మహిళలు విగతజీవులుగా మారడంతో ఆ గ్రామంతో పాటు వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.