ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవతో నిరుపేద వైద్యానికి ఆసరా

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు మోదెలకు చెందిన మంచాల దయమణి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్యం కోసం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసీ మంజూరైంది. కాంగ్రెస్ నాయకురాలు సురేఖ ఆ పత్రాన్ని శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు.