ఉప్పొంగిన గుండేటి వాగుతో జలదిగ్బంధంలో పన్నెండు గ్రామాలు విలవిల
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
కుక్కునూరు మండలంలో గుండేటి వాగు వద్ద రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉదృతి విపరీతంగా పెరగడంతో వాగుపై ఉన్న వంతెన పూర్తిగా నీట మునిగింది. దీంతో పన్నెండు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.