వాహనదారులకు హెచ్చరిక: తప్పనిసరిగా పీయూసీ లేకపోతే భారీ జరిమానా తప్పదు

రిపోర్టర్: సునీల్ స్థలం: నెల్లూరు

వాహన చోదకులు ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణ పరీక్ష పత్రం కలిగి ఉండాలని నెల్లూరు జిల్లాలో రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. పీయూసీ పత్రం లేకపోతే రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా వాహనాల యాజమాన్య హక్కుల బదిలీ సమయంలో ఈ పత్రాలు అత్యంత కీలకమని అధికారులు తెలిపారు. నిబంధనల అమలులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.