రైల్వే టికెట్ UPI బుకింగ్స్‌పై కొత్త MDR నిబంధనలు

రిపోర్టర్: నరేష్ స్థలం: భారతదేశం

భారతీయ రైల్వేలో యూపీఐ ద్వారా రూ.2,000 కంటే ఎక్కువ విలువైన రైలు టికెట్ల చెల్లింపులకు 2026 అక్టోబర్ 15 నుంచి ప్రత్యేకంగా రూ.5 ఫ్లాట్ మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించనుంది. ఈ ఛార్జీని ప్రయాణికుల నుంచి వసూలు చేయడానికి వీళ్లేదని, వ్యాపారి లేదా సంబంధిత సేవా సంస్థే భరించాలని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. సాధారణ వ్యక్తిగత బదిలీలు, రూ.2,000 లోపు చెల్లింపులు యథావిధిగా ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.