వ్యాపారులకు యూపీఐ పేమెంట్స్‌పై కొత్త ఛార్జీలు అమల్లోకి!
రిపోర్టర్: సురేష్
స్థలం: India
డిజిటల్ లావాదేవీలపై వ్యాపారులకు కొత్త యూపీఐ ఛార్జీల పట్టిక అమల్లోకి వచ్చింది. నెలకు లక్ష రూపాయల వరకు వ్యాపారం చేసే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చారు. అంతకంటే ఎక్కువ లావాదేవీలపై పరిమాణాన్ని బట్టి ఛార్జీలు వర్తిస్తాయి. అయితే రైల్వేలు, పెట్రోల్ బంకులు, ఇన్సూరెన్స్ రంగాలకు రూ. 2 వేలకు మించిన లావాదేవీలపై కేవలం రూ. 5 ఫిక్స్డ్ ఛార్జీ మాత్రమే వసూలు చేస్తారు.