మనీలాండరింగ్ కేసులో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ కు జైలు కస్టడీ

రిపోర్టర్: మహేష్ స్థలం: Ghaziabad

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి మహమ్మద్ ఆజం ఖాన్ కు కోర్టు పద్నాలుగు రోజుల జైలు కస్టడీ విధించింది. బెయిలుపై విడుదలైన కొద్దిసేపటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ను మళ్లీ అరెస్ట్ చేశారు. రాంపూర్ లోని మహమ్మద్ అలీ జోహార్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలపై కేంద్ర సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసిందని అధికారులు తెలిపారు. ఆయనను ఘజియాబాద్ లోని దాస్నా జైలుకు తరలించారు.