మధ్యప్రదేశ్ ఆసుపత్రిలో వైద్యురాలిపై వైరల్ వీడియో వివాదంపై అధికారుల స్పష్టత
రిపోర్టర్: గోపి
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబహ్ సివిల్ ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేయడానికి డాక్టర్ నిరాకరించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఆసుపత్రి అధికారులు స్పష్టతనిచ్చారు. డాక్టర్ ఆర్తి దండోటియాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ప్రమాదంలో గాయపడిన ఆ ముగ్గురు వ్యక్తులకు అప్పటికే వైద్య చికిత్స అందించినట్లు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ప్రమోద్ శర్మ వెల్లడించారు. పూర్తి వీడియోను బంధించకుండా కేవలం కొద్ది సెకన్ల క్లిప్‌ను మాత్రమే వైరల్ చేశారని, ఈ ఘటనపై నెట్టింట భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి.