మద్యం రవాణా కేసు: హైకోర్టులో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిలు రద్దు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

వైకాపా హయాంలో మద్యం రవాణా పేరుతో ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం కలిగించిన కేసులో ఏపీఎస్‌బీసీఎల్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిల ముందస్తు బెయిలు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. తీవ్ర ఆర్థిక నేరాల్లో ముందస్తు బెయిలివ్వలేమని స్పష్టం చేసింది. రాజకీయ ప్రతీకారంతోనే కేసు పెట్టారన్న వాదనను తోసిపుచ్చింది. ప్రస్తుతం ఈ కేసును సిట్‌ దర్యాప్తు చేస్తోంది.