జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసులో పదిమందికి దోషులుగా తీర్పు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఛత్తీస్‌గఢ్

2013లో ఛత్తీస్‌గఢ్‌లోని జిరామ్ వ్యాలీలో జరిగిన ఘోర మావోయిస్టు దాడి కేసులో 10 మందిని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. నాటి కాంగ్రెస్ పరివర్తన యాత్రపై జరిగిన ఈ దాడిలో నందకుమార్ పటేల్, మహేంద్ర కర్మ, వి.సి. శుక్లా సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 101 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, శిక్షా వివరాలను సెప్టెంబర్ 16న వెల్లడించనుంది.