జనసేన పార్టీ బలోపేతానికి అందరూ సమష్టిగా కృషి చేయాలి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం సాగరమాల కన్వెన్షన్‌లో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో మంత్రి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించారు.