పరవాడలో ఘనంగా సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పరవాడ
పరవాడ మండలం పెదముషిడివాడు పంచాయతీ గండివానిపాలెంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న బలిరెడ్డి అప్పారావు ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం ప్రకటించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.