సూరారంలో కౌసర్ హాస్పిటల్ ప్రారంభం: మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వివేకానంద్ ఆకాంక్ష
రిపోర్టర్: హరి
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కౌసర్ హాస్పిటల్ యాజమాన్యం మంచి పేరు గడించాలని బీఆర్ఎస్ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆకాంక్షించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌసర్ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసుపత్రి ప్రారంభ వేడుకలను విజయవంతం చేసినట్లు తెలిపారు.