రాప్తాడు నిందితుడి ఎన్కౌంటర్: కాళ్లు తొలగించే అవకాశం ఉందన్న వైద్యులు
రిపోర్టర్: గోపి
స్థలం: అనంతపురం
రాప్తాడు ఘటనలో బాలికపై దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, ఆత్మకూరు అడవుల్ లో సీఐపై కత్తితో దాడికి యత్నించడంతో పోలీసులు జరిపిన కాల్పుల్ లో తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అనంతపురం జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి కాళ్లలో మూడు బుల్లెట్లు ఉండటంతో కాళ్లు తొలగించే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.