పోలీసుల చొరవతో మహిళకు దక్కిన వెండి పట్టీలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో రాపిడో ఆటోలో పోగొట్టుకున్న వెండి పట్టీల బ్యాగ్‌ను పోలీసులు వేగంగా స్పందించి బాధితురాలికి అప్పగించారు. షీలానగర్ నుంచి కల్లుపాక వెళ్తుండగా బ్యాగ్ మరిచిపోయిన రొట్ట జ్యోతి అనే మహిళా 2 టౌన్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన సిబ్బంది కొన్ని గంటల్లోనే బ్యాగ్‌ను రికవరీ చేసి ఆమెకు అందజేయడంతో నగర సీపీకి, పోలీసులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.