నాగర్కర్నూల్ జిల్లాలో భూ ఆక్రమ పట్టాల కుంభకోణం: రెవెన్యూ శాఖ విచారణ వేగవంతం

రిపోర్టర్: కృష్ణ స్థలం: నాగర్‌కర్నూల్

నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లిలో నాలుగు కోట్ల విలువైన పదమూడు ఎకరాల భూ అక్రమ పట్టాల వ్యవహారంపై రెవెన్యూ శాఖ విచారణ ముమ్మరం చేసినట్లు సబ్ కలెక్టర్ సలోని చాబ్రా వెల్లడించారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే తహశీల్దార్ సస్పెండ్ కాగా, కంప్యూటర్ ఆపరేటర్ తొలగించబడ్డారు. రికార్డుల తారుమారుపై ఫోర్జరీ కోణంలో దర్యాప్తు జరుపుతూ, అక్రమంగా పట్టాలు పొందిన తొమ్మిది మంది లబ్ధిదారులపై క్రిమినల్ చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.