మురసు తుఫాన్ బీభత్సం: ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో మురసు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్ లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి వరద ఉద్ధృతిని, నీటమునిగిన పంటలను పరిశీలించారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, నష్టాన్ని అంచనా వేసి పూర్తి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.