గుంటూరు జీజీహెచ్‌లో తొలి జన్యు పరీక్షల ప్రయోగశాలను ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్

రిపోర్టర్: సతీష్ స్థలం: గుంటూరు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా క్యాన్సర్‌ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో రూ.2.5 కోట్లతో ఏర్పాటుచేసిన ప్రత్యేక జన్యుపరీక్షల ప్రయోగశాలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో వేలాది రూపాయలు ఖర్చయ్యే ఈ పరీక్షలను ఇక్కడ ఉచితంగా చేయనున్నారు.