ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో వృద్ధులపై జర్మన్ సిబ్బంది వివక్ష
రిపోర్టర్: రాము
స్థలం: Frankfurt
ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో వృద్ధులైన భారతీయ ప్రయాణికుల పట్ల లుఫ్తాన్స సిబ్బంది వివక్షతో ప్రవర్తించారని ప్రయాణికుడు కునాల్ బిస్వాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. సెప్టెంబర్ 23న గేట్ వద్ద వృద్ధులను పశువుల మాదిరిగా చూశారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ విమానాశ్రయాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.