సికింద్రాబాద్ కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులు
రిపోర్టర్: నరేష్
స్థలం: సికింద్రాబాద్
దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 26 వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రానున్న ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు మరికొన్ని రైళ్ల సర్వీసులను కూడా పొడిగించినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.