గణేష్ నిమజ్జనానికి బాపట్ల జిల్లా పోలీసుల పటిష్ట భద్రత
రిపోర్టర్: విజయ్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వాడరేవు, రామాపురం బీచ్‌లలోని నిమజ్జన ప్రాంతాలను జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ స్వయంగా పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 86 నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు 112 లేదా 100 నంబర్లను సంప్రదించాలని సూచించారు.