ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది

రిపోర్టర్: రాము స్థలం: Adilabad

ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ మరియు జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఈ అధికారులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులకు త్వరలోనే వేగం పుంజుకునే అవకాశం ఉంది.