స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ షాక్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం వెల్లడించింది. మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం పరిమితి దాటకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిందని అధికారులు తెలిపారు. దీనితో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.