ఇరాన్ అగ్రనేతలే టార్గెట్: మొసాద్ సీక్రెట్ ఆపరేషన్ పై ఇజ్రాయెల్ మాజీ అధికారి సంచలనం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: టెహ్రాన్

ఇరాన్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ అత్యంత రహస్యంగా సీక్రెట్ ఆపరేషన్ కు ప్రణాళికలు రచిస్తోందని మొసాద్ మాజీ డిప్యూటీ హెడ్ ఒడెడ్ ఐలామ్ వెల్లడించారు. హెజ్బొల్లా తరహాలోనే కమ్యూనికేషన్ పరికరాల్ లో పేలుడు పదార్థాలు అమర్చి ఇరాన్ కీలక నేతలను హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికాతో ఒప్పందాలను అడ్డుకుంటున్న నలుగురు కీలక అధికారులను టార్గెట్ చేసినట్లు సమాచారం.