నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌తో నేడు ఫోన్ ఇన్ కార్యక్రమం
రిపోర్టర్: ఇజం జర్నలిసిం ✍️✍️
స్థలం: నర్సంపేట
నర్సంపేట టీజీఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం నేడు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు 7382926166, 9959226052 నంబర్లకు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు లేదా ఫిర్యాదులను డిపో మేనేజర్ సరస్వతికి నేరుగా తెలియజేయవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.