భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తోందని ట్రంప్ స్పష్టీకరణ

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత్, అమెరికాల మధ్య ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందం ఖరారుకు అత్యంత చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య త్వరలోనే కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్లో పర్యటిస్తున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.