జన్నారం మండలంలో చివరి ఆయకట్టు భూములకు అందక అల్లాడుతున్న సాగునీరు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివార్లలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అందడం పూర్తిగా కష్టంగా మారింది. కడెం ప్రాజెక్టు కాలువల ద్వారా నీరు వస్తున్నప్పటికీ, చివరి భూములకు చేరేసరికి నీటి ప్రవాహం ఆగిపోతోంది. దీనివల్ల భూమిలో తేమశాతం తగ్గి పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. కష్టపడి పండించిన పంటలను కాపాడాలని స్థానిక రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.