భారీ వర్షాలతో అధ్వానంగా మారిన ధారకొండ గంగవరం రహదారి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
జీకే వీధి మండలంలోని ధారకొండ నుంచి గంగవరం వెళ్లే రహదారి భారీ వర్షాల కారణంగా పూర్తిగా అధ్వానంగా తయారైంది. రోడ్డుపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.