బస్సులో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఇబ్రహీంపట్నం

బస్సులో ప్రయాణిస్తున్న కాలేజీ విద్యార్థినితో కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలును పరిశీలిస్తున్న సమయంలో ఆయన యువతిని తాకడంపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థిని అసౌకర్యంగా భావించినా పట్టించుకోకుండా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.