పాఠశాల విద్యార్థిపై దాడి చేసిన ఆర్టీసీ డ్రైవర్ డిస్మిస్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు సమీపంలో పాఠశాల విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు డ్రైవర్ స్వామిని సంస్థ విధులనుంచి తొలగించింది. ఈ ఘటనపై తక్షణ విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు డ్రైవర్ బాధ్యతారాహిత్యాన్ని నిర్ధారించి ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.