'సరిహద్దు ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అంతం చేయాలి': ఐరాసలో పార్వతనేని హరీశ్ ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

అఫ్గానిస్థాన్ సంక్షోభం మరియు ప్రాంతీయ భద్రతా సవాళ్లపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పార్వతనేని హరీశ్ మాట్లాడుతూ, ఎలాంటి భద్రత లేకుండా మిలియన్ల కొద్ది అఫ్గాన్లను బలవంతంగా వెనక్కి పంపడాన్ని తప్పుబట్టారు. సరిహద్దు ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు అండగా నిలుస్తున్న వాతావరణాన్ని అంతం చేయాలని, 9/11 ఉగ్రదాడి సూత్రధారులకు ఆశ్రయం కల్పించినట్లే నేడు కొందరు ఉగ్రవాదులను కాపాడుతున్నారని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించారు.