పొందూరులో ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణపై అధికారులను నిలదీసిన వైఎస్సార్సీపీ నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పొందూరు
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో ఎంపీటీసీల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియపై తీవ్ర వివాదం చెలరేగింది. నామినేషన్లు విత్డ్రా చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలపడంతో వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అలా చేయలేదని ఆముదలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అధికారులను నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన రిటర్నింగ్ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.